Ad Code

Responsive Advertisement

Telugu Whatsapp status Quotations | - sweetymyworld

 Telugu Whatsapp status Quotations

 


పెళ్ళెన కొత్తలో అత్తింటోళ్ళు బైకో, కారో కొనిచ్చి ఓనర్ ని చేశారని పొంగిపోతారు.. చాలామంది. కానీ తర్వాత తెలుస్తుంది.. వాళ్ళ కూతురిని తిప్పడానికి డ్రైవర్ని చేశారని..!!


Meme:

ప్రియ: ఏ వ్రతం చేస్తే మంచి మొగుడొస్తాడు మమ్మీ?

తలి: పిచ్చిదానా.. ఏ వ్రతం చేసినా మంచి మొగుడు రాడే. వచ్చిన వాడినే తిట్టో, కొట్టో మనమే దారికి తెచ్చుకోవాలి.




లక్షలు, లక్షలు పెట్టి ముడిపడిన బంధాల కన్నా ఏమీ ఆశించకుండా మనసుతో ముడిపడిన బంధమే గొప్పది..!!




నీ చూపుకై.. నీ పిలుపుకై నీరీక్షణలోనే నా ప్రాణం పోతుందేమో..

ఈ క్షణం..!!




అందరిలో మంచి చూడటం మంచిదే మంచి మాత్రమే వుంటుంది అనుకోవడం పొరపాటే..!




దొరికిన దానితో సంతృప్తి పడే వాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు..!!





మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం

మనల్ని పట్టించుకోని మనుషుల దగ్గర మమకారం చూపించకూడదు.




నీ చుట్టూ ఉండే మనుషులు చాలా వరకూ నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపాలు బయటపెడతారు.. తస్మాత్ జాగ్రత్త..!





నువ్వే నా ప్రపంచం నువ్వే నా ప్రాణం నువ్వే నా ప్రేమ లోకం నువ్వు నా పక్కన ఉంటే ప్రతిరోజూ ఆనందం నావెంటే.





పక్కోడి కంచంలో అన్నం లాక్కుంటే ఈ రోజుకి నీ కడుపు నిండుతుందేమో కానీ నువ్వు చేసిన పాపం రేపు నీ బిడ్డలకు శాపం అవుతుంది




ఎండాకాలం సూర్యుడిని తిట్టిన వాళ్ళే చలికాలంలో సూర్యుడి కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తుంటారు అలాగే ఈ రోజు మిమ్మల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు కావాలింది ఓపిక..!


 


ఎంత నిగ్రహంగా ఉంటే

అంత అగ్రస్థానం

ఎంత దూరంగా ఉంటే

అంత గౌరవం

ఎంత హద్దుల్లో ఉంటే

అంత మర్యాద

ఎంత తక్కువ ప్రేమిస్తే

అంత మనశ్శాంతి

ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత

ఎంత తక్కువ మాట్లాడితే

అంత విలువ










Post a Comment

0 Comments

Close Menu