Ad Code

Responsive Advertisement

తెలివైన చిలుక | - sweetymyworld

 

తెలివైన చిలుక



అవ్వ వడలు కాలుస్తుంటే పొదల చాటునుండి నక్క చూడసాగింది. వడలు కాలవడం పూర్తయ్యాక అన్నీ పాత్రలో వేసుకొని అందులోంచి ఒక వడను తీసి 'కా కా' అంటూ చెట్టుకింద వుంచింది. చిట్టి కాకి వచ్చి వడ తీసుకొని చెట్టుపైకి వెళ్లి కూర్చొంది.


అవ్వ లోపలకు వెళ్లగానే నక్క చెట్టు కిందకు వెళ్లి 'చిట్టి కాకీ.. మదువుగా ఒక పాట పాడవా' అంది.


అమాయకురాలైన చిట్టి కాకి 'కా.. కా..' అంటూ మెల్లగా పాడసాగింది. నోటిలోని వడ కింద పడగానే నక్క తీసుకొని వెళ్లింది. నక్క రోజూ ఇలాగే కాకిని మోసం చేయసాగింది.


ఒకరోజు చెట్టుపైకి ఒక చిన్ని చిలుక వచ్చింది. మోసం చేసి వడను తీసుకెళ్తున్న నక్కను చూసింది. చిన్ని చిలుక కాకిని అడగగా.. 'ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంది' అని చెప్పింది. 'ఇకపై వడ తింటున్న సమయంలో నక్క పాడమంటే నేను చెప్పినట్లు చెయ్యి' అని ఒక సలహా ఇచ్చింది.


మరుసటి రోజు చిట్టికాకి నోటిలో వడవున్నప్పుడు నక్క వచ్చి పాట పాడమని అడగింది. వెంటనే కాకి చిలుక చెప్పిన విధంగా వడ చిలుకకు ఇచ్చి 'కాకా' అంటూ గట్టిగా

అరిచింది.


చుట్టుపక్కల వున్న కాకులు రాగానే రోజూ జరుగుతున్న సంగతి కాకులకు వివరించి చెప్పింది. చిన్ని చిలుక.


'అమాయకురాలైన చిట్టి కాకిని ఇకమీదట మోసం చేశావంటే నీ కళ్లు పొడిచేస్తాం' అంటూ కాకులన్నీ గుంపుగా నక్కను హెచ్చరించాయి.


'ఇకపై అమాయకపు కాకిని మోసం చేయలేను’ అనుకొంటూ వెళ్లిపోయింది నక్క.


'తెలివైన పక్షి పక్కనుంటే అమాయకపు పక్షిని ఎవరూ మోసం చేయలేరు' అంటూ చిన్ని చిలుకను కాకులు మెచ్చుకొన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu