Ad Code

Responsive Advertisement

పల్లె ఎలుక - పల్లి ఎలుకను | - sweetymyworld.blogspot.com

 పల్లె ఎలుక - పల్లి ఎలుకను



పల్లె ఎలుకను చూడాలని ఒక పట్నం ఎలుక ఊరికి వెళ్ళింది. పల్లె ఎలుక పొలంలో ఉండేది. తన దగ్గర ఉన్న శనగలు, గోధుమలు, వరి మొదలైన గింజలు పట్నం ఎలుకకి పెట్టింది.


పట్నం ఎలుక వాటిని తిని "మీరు ఈ పల్లెలో ఇలా గింజలు మాత్రమే అంటున్నారు. అందుకే నువ్వు టక్కుగా ఉ న్నావు. పట్నంలో మేం ఎన్ని రకాలు తింటామో, ఎలా ఉంటామో చూద్దువు గాని రా!" అంటూ పిలిచింది.


ఒకరోజు పట్నం ఎలుకని చూడటానికి పల్లె ఎలుక వెళ్ళింది. ఒక ఇంటి వంట గట్టు మీద పాయసం ఉంది. ఆ పాయసాన్ని తినబోయాయి. ఇంతలో "మ్యావ్ " అంటూ ఒక పిల్లి వాటి మీదకి దూకింది. అవి పొయ్యి వెసుక దాక్కున్నాయి.


అక్కడి నుండి ఎలాగో తప్పించుకున్నాయి. ఇక ఆ పగలంతా అవి కలుగులోంచి బయటకు రాలేదు. రాత్రి అయ్యింది. పట్నం ఎలుక మెల్లగా తలుపు సందులోంచి పల్లె ఎలుకని భోజనాల గదిలోకి తీసుకువెళ్ళింది. రెండూ భోజనాల బల్లమీదకి ఎక్కాయి. రకరకాల వంటలు బల్లమీద ఉన్నాయి. అటువంటి విందు భోజనాన్ని పల్లె ఎలుక చూడలేదు. "నువ్వు చెప్పింది నిజమే! మా పల్లెలో ఇలాంటి భోజనాన్ని ఎప్పుడూ తినలేదు" అంది ఎలుక.


ఇంతలో ఒక మనిషి వాటిని చూసి వెంటపడ్డాడు. దాంతో అవి తలుపు సందులోంచి అతి కష్టం మీద తప్పించుకున్నాయి.


"పొలంలో ఉన్న నా ఇల్లే నయం. తినటానికి బ్రెద్దు, జున్ను, వెన్న లేకపోయినా, ఇటువంటి భయం ఎప్పుడూ.. ండదు" అంటూ తన పల్లెకు బయలుదేరి వెళ్ళింది పల్లె ఎలుక.

Post a Comment

0 Comments

Close Menu