వృద్ధాశ్రమం వర్థిల్లాలి
యాదయ్య పుష్కలంగా డబ్బు సంపాదిం చాడు. ముగ్గురు కొదుకులకూ పెళ్లిళ్లు చేసి ఆస్తినంతా ముగ్గురికీ పంచేశాడు. కొడుకులు వేరు కాపురాలు పెట్టారు. యాదయ్య తన భార్య అన్నమ్మతో పాత ఇంట్లోనే ఉండిపోయాడు. రోజులు దొర్లుతున్నాయి. అన్నమ్మకు అవసాన 'దశ వచ్చింది. 'మన బిక్షలు. మనల్ని అడ్డుకుంటారో లేదో నన్న అనుమానంతో మొదటి నుంచీ కొంత సొమ్ము రాస్తూ వచ్చాను. ఇదిగో అంటూ పెద్ద సంచీని అతని చేత బెట్టి ఆమె కన్నుమూసింది. అంత్యక్తి యలయ్యేదాకా ఉండి వెళ్లిపోయారు. కొడుకులు మళ్ళీ రాలేదు. యాదయ్యను తమతో
రమ్మనలేదు. యాదయ్య ఓరోజు పెద్ద కొడుకు ఇంటికి వెళ్లాడు. కొడుకు కోడలు గుమ్మంలోనే వచ్చి నిలుచున్నారు. ఉన్నా రుగా మరో ఇద్దరు? వాళ్లద గ్గరికి వెళ్ళు' అన్నారు. ఆ ఇద్దరి దగ్గరికి వెళితే, వాళ్ళు ఆ మాటే అన్నారు.
యాదయ్య ఆరోజే ఆ ఊరు విడిచాడు చాలా దూరం వెళ్లి ఓ పట్టణం దగ్గర మూడెకరాల మెట్ట చేను కొన్నాడు. పెద్ద పాక వేసి, బోరు బావి తవ్వించాడు. కంచె వెలుపల 'అన్నమ్మ. వృద్ధాశ్రమం' అని బోర్డు పెట్టించాడు. ఓ నలు గురైదుగురు అనాథలతో ప్రారంభమైన ఆ వృద్ధా శ్రమం దినదిన ప్రవర్థమానమైంది. ఆశ్రమంలో ప్రహరీ గోడల వెంబడే టేకు చెట్లు నాటించాడు. యాదయ్య అందరూ కలిసి కూరగాయల సాగు చేశారు. వాటిని మార్కెట్లు వాళ్ళు వచ్చి కొనుక్కు పోతున్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఓ అరవై మంది దాకా వృద్ధులున్నారు. యాదయ్యకు పందేళ్లు నిండాయి మనిషి దృఢంగా ఉన్నాడు.
ఓరోజు ఆశ్రమం వార్షికోత్సవం జరిపాడు. ప్రముఖులు ప్రసంగిస్తూ యాదయ్యకు ఎంతో పొగిడారు. యాదయ్య ఆశ్రమవాసుల్ని ఉద్దే శించి ప్రసంగించాడు. సోదరులారా! నేను ఈ ఆశ్రమంలో చేరిన మొదటి అనాథను. ఇప్పుడు నాకు అరవైమంది సోదరులు ఉన్నారు. ఈ ఆశ్రమం మన తల్లి. దీని ప్రగతికి పాటుప రుదాం వేళకు తిందాం వేళకు పడుకుందాం. వ్యాయామం చేద్దాం. ఆరోగ్యం కాపాడుకుందాం. మన కోసం కాదు సుమా! రేపటి తరాల కోసం. అన్నమ్మ వృద్ధాశ్రమం వర్ధిల్లాలి?
ఆశ్రమంలో చేరాలన్న ఆశతో వచ్చి ప్రేక్షకుల నడుమ ప్రేత కళతో కూర్చుని ఉన్న యాదయ్య ముగ్గురు కొడుకులు కూడా 'వర్ధిల్లాలి' అంటూ బిగ్గరగా నినదించారు.
0 Comments