పిశాచి part -1
(దయ్యాలు నిజంగా ఉన్నాయా?)
1. ఆమె ఆత్మ ఎందుకు వస్తున్నది?
చాలాకాలం క్రితం జపాన్లో ఈ సంఘటన జరిగిందని చెబుతారు. కొన్ని సమయాలలో చనిపోయిన వ్యక్తులు ప్రేతాత్మలుగామారి మళ్ళీ తమ ఇళ్ళకు తిరిగి వస్తారు. అలా ఎందుకు తిరిగి వస్తారు? అంటే వాళ్ళు ఆ ఇళ్ళలో చెయ్యవలసిన పనులు ఏవో మిగిలిపోయాయి అని గుర్తించాలి. యదార్ధంగా జరిగిన ఈ కధలో కూడా ఒక చనిపోయిన అమ్మాయి ఆత్మ అప్పుడప్పుడూ తన ఇంటికి తిరిగి వస్తూ ఉండేది. ఆమె ఏకారణంగా అలా వస్తూ ఉండేది అన్న విషయం చాలాకాలంపాటు ఒక నిగూఢ రహస్యంగా మిగిలిపోయింది. ఆ తరువాత ఒక సమయంలో ఆ రహస్యం బయటపడింది. ఇంతకీ ఆమె ఎందుకు అలా మళ్ళీ మళ్ళీ తన ఇంటికి ఆత్మగా వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకోవటంకోసం, ఆ అమ్మాయియొక్క గతం గురించి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. అది ఎలాగంటే....
సుమారు 500 సంవత్సరాల క్రితం జపాన్లోని తంబా రాష్ట్రంలో ఒక సంపన్నుడైన వ్యాపారి ఉండేవాడు. అతనిపేరు ఇనామొరయ. ఆ వ్యాపారికి 'ఓ-సోనో' అనే పేరుగల ఒక అందమైన మరియు తెలివిగల కూతురు ఉండేది. ఆ కాలంలో సాంప్రదాయ జపాన్ కుటుంబీకులు అమ్మాయిలకు దైవ పూజలు, కుటుంబాన్ని ఎలా చక్కగా నిర్వహించుకోవాలి అనే విషయాల గురించి మాత్రమే నేర్పుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ వ్యాపారి మాత్రం తన కూతురికి ఆనాటి ఆధునిక ధనికుల సమాజానికి చెందిన సంస్కృతిని, నాగరికతను నేర్పించాలనుకున్నాడు. అందువలన ఆయన తరచుగా తన కూతురుని ఆ రాష్ట్ర రాజధాని నగరంలో ధనవంతులైన ఆడపిల్లలకు ఆధునిక నాగరికతను నేర్పించే స్త్రీల వద్దకు పంపిస్తూ ఉండేవాడు.
ఆ తరువాత కొన్నాళ్లకు ఆ వ్యాపారి తన కుమార్తె 'ఓ-సోనో'ని తన ఆత్మీయ మిత్రుడు కుమారుడైన 'నగరాయ'కి ఇచ్చి వివాహం చేసాడు. ఆ వ్యాపారి అల్లుడు కూడా వ్యాపారస్తుడు అవటం విశేషం. ఏది ఏమైనా 'ఓ-సోనో' తన భర్త నగరాయతో కలసి అత్తగారింట్లో కొద్ది నెలలపాటు ఆనందంగా కాపురంచేసింది. ఫలితంగా ఆమెకు గర్భం వచ్చింది. ఆ తరువాత ఆమెకు అందమైన మగబిడ్డ పుట్టాడు. దురదృష్టవశాత్తు వివాహం అయిన నాలుగు సంవత్సరాల తరువాత 'ఓ-సోనో'ని ఏదో తెలియని అనారోగ్యం వచ్చి, ఆపై ఆమె ఒకరోజు రాత్రి హఠాత్తుగా చనిపోయింది. ఆమె చనిపోయిన రోజు మరియు ఆమె పెళ్ళిరోజు ఒకటే కావటం ఆమె భర్త నగరాయకు విపరీతమైన మనోవేదనను కలిగించింది.
ఏదిఏమైనా అలా అకాలమృతి చెందిన 'ఓ-సోనో'కి మహాయాన బౌద్ధమత విధానంలో అంత్యక్రియలు చేసారు. మరుసటిరోజు రాత్రి, నాలుగు సంవత్సరాల పసిబిడ్డ అయిన 'ఓ-సోనో' కొడుకు తన చిన్ని చిన్న పాదాలతో చిన్నగా నడుస్తూ తన తండ్రి వద్దకువెళ్ళి “నాన్నా! అమ్మ ఇప్పుడే మెట్లమీదుగా నడుస్తూ మేడమీద గదిలోకి వెళ్ళింది" అన్నాడు. మొదట ఆ బిడ్డ చెబుతున్నది ఏమిటో నగరాయకు అర్ధంకాలేదు. దాంతో ఆ బిడ్డ రెండు మూడు సార్లు చెప్పాడు. అప్పటికి విషయం అర్ధమయిన నగరాయకు చాలా ఆశ్చర్యం వేసింది. నిన్న మధ్యాహ్నం సమాధి చెయ్యబడిన 'ఓ-సోనో' ఈరోజు ఎలా తిరిగివస్తుందో? అర్ధంకాక అయోమయంలోపడ్డ నగరాయ ఎందుకైనా మంచిదని గబగబా మేడమీద గదిలోకివెళ్ళి చూసాడు. అక్కడ అతని భార్య 'ఓ-సోనో' కనపడింది. ఆమెనుచూసి నగరాయ నిర్ఘాంతపోయాడు. ఆమె అతడినిచూసి చిరునవ్వు నవ్వింది. అప్పుడు తేరుకున్న నగరాయ పెద్దగా అరిచి అక్కడ నుండి కిందకు దిగివచ్చాడు. అతడు అలా మేడమీద నుంచి కంగారుగా భయపడుతూ కిందకు రావటం గమనించిన అతడి కుటుంబీకులు, పైన ఏముందో చూద్దామని ఆందోళనగా పై గదిలోకి పరుగెత్తారు. వారికి కూడా అక్కడ 'ఓ-సోనో' కనపడింది. వాళ్ళందరూ ఆమెనుచూసి భయపడ్డారు. అయితే ఆమె వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఆ గదిలో ఒక ప్రక్క, గోడకు అమర్చబడిన తన బీరువా తలుపుల్ని తియ్యటానికి ప్రయత్నిస్తున్నది.
ఒక విశేషం ఏమంటే 'ఓ-సోనో' పరిపూర్ణమైన మనిషిలాగా కనపడటంలేదు. కొంతవరకు ఆమె రూపం అస్పష్టంగా అక్కడ ఉన్నవాళ్ళకు కనిపించింది. ఆమెయొక్క తల, భుజాలు స్పష్టంగా కనిపించాయి కాని అక్కడ నుండి కిందభాగం ఒక పొగలాగా అస్పష్టంగా కనపించింది. దాంతో తీవ్రమైన భయాందోళనకు గురైన ఆ కుటుంబీకులందరూ ఆ గదిలో నుండి కిందకు పరుగెత్తుకుంటూ వచ్చారు. 'ఓ-సోనో', ప్రేతాత్మగా మారి ఇంటికి తిరిగి వచ్చింది అని వాళ్ళందరికీ స్పష్టంగా అర్ధమయ్యింది. అయితే ఆమె ఏకారణంగా తిరిగి వచ్చిందో అర్ధంకాక వాళ్ళందరూ ఎవరికి తోచిన కారణం వాళ్ళు చెప్పారు. చివరగా నగరాయ అందరివైపు పరిశీలనగా చూస్తూ ఇలా అన్నాడు. “నా భార్య 'ఓ-సోనో'కి తన నగలు మరియు వస్త్రాలమీద ఎంతో ఆపేక్ష ఉన్నట్లుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆమె, మా పడక గదిలో ఉన్న ఆమె బీరువా తలుపుల్ని 'తెరవాలని ప్రయత్నించింది. చాలామందికి చనిపోయిన తరువాత కూడా వారి తాలీకు వస్తువులమీద అభిమానం పోదు. ఇప్పుడు తన ఆభరణాలమీద, వస్త్రాలమీద ఉన్న వ్యామోహం కారణంగానే 'ఓ-సోనో' ఆత్మ పై లోకాలకు వెళ్ళకుండా ప్రేతాత్మగామారి వాటిని చూసుకోవటం కోసం ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె సహజంగా దైవ భక్తురాలు. అందువలన ఆమెయొక్క నగలను, వస్త్రాలను మన పట్టణంలో ఉన్న బుద్ధుడి ఆలయంలో ఇచ్చేద్దాం. అలా అయితే ఆమె ఆత్మకు శాంతి చేకూరి పై లోకాలకు వెళ్ళిపోతుంది”.
నగరాయ చెప్పిన మాటల్లోని వాస్తవం ఆ కుటుంబీకులందరికీ అర్ధమయ్యింది. అప్పుడు నగరాయ తల్లి ఇలా అన్నది. “రేపు ఉదయమే నగరాయ చెప్పిన మాటల్లోని వాస్తవం ఆ కుటుంబీకులందరికీ అర్ధమయ్యింది. అప్పుడు నగరాయ తల్లి ఇలా అన్నది. “రేపు ఉదయమే 'ఓ-సోనో'కి చెందిన అన్ని ఆభరణాలను, వస్త్రాలను, ఇతర వస్తువులను ఆమె బీరులో నుండి బైటకుతీసి బుద్ధుడి ఆలయంలో ఇచ్చివేద్దాం". ఆ ప్రకారమే మర్నాడు ఉదయం నగరాయ తన కుటుంబీకులతో కలసి బుద్ధుడి ఆలయంలో 'ఓ-సోనో' యొక్క నగలను, వస్త్రాలను కానుకగా సమర్పించాడు. దాంతో 'ఓ-సోనో' యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుందని, అందువల్ల ఆమె ఇక ఇంటికి తిరిగి రాదని నగరాయ కుటుంబీకులు బలంగా విశ్వసించారు. 'కానీ వారి అంచనా తప్పు' అని ఆరోజు రాత్రే రుజువు అయ్యింది. ఎందుకంటే ఆరోజు రాత్రి 12 గంటలకు 'ఓ-సోనో ప్రేతాత్మ మళ్ళీ తన బీరువా దగ్గరకు వచ్చి బీరువాలోని అరలను వెతకటం ప్రారంభిం చింది. ఆ దృశ్యంచూసి నగరాయ కుటుంబీకులు హడలి పోయారు. ఆ తరువాత ఎన్నో రాత్రుళ్ళు 'ఓ-సోనో' ఆత్మ ఆ ఇంటికి రావటం బీరువా అరలలో వెతికి వెళ్ళిపోవటం జరిగింది. ఆమె ప్రేతాత్మను పదేపదే చూసి విపరీతంగా బాధపడ్డ నగరాయ ఒకరోజు ఉదయం బుద్ధుడి ఆలయం లోని ప్రధాన పూజారి వద్దకువెళ్ళి ఆయనతో 'ఓ-సోనో' ప్రేతాత్మ గురించి
వివరంగా తెలియజేసాడు. ఆ ప్రధానపూజారి పేరు డైజన్. నగరాయ చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న తరువాత ఆ వృద్ధపూజారి డైజన్ ఇలా అన్నాడు.
"బిడ్డా! నీ భార్య ఆత్మ మళ్ళీ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నది అంటే దానివెనకాల ఏదో నిగూఢ రహస్యం దాగి ఉన్నదని నాకు అనిపిస్తున్నది. అది ఏమిటో ఇవాళ రాత్రే నేను తేల్చివేస్తాను. నీవు నిర్భయంగా ఉండు". ఆపై ఆ వృద్ధపూజారి డైజన్ ఆ రోజు అర్ధరాత్రి సమయానికి నగరాయ ఇంటికి చేరుకున్నాడు. ఆ తరువాత నగరాయతో ఇలా చెప్పాడు. "బిడ్డా! నేను ఇప్పుడు ఆ గదిలోకి వెళుతున్నాను. నేను పిలిచేవరకు మీరెవరూ ఆ గదిలోకి పొరపాటున కూడా రావొద్దు జాగ్రత్త. నగరాయ సరే, అన్నట్లుగా తల వూపాడు. ఆపై ఆ వృద్ధ పూజారి డైజన్ పై గదిలోకి వెళ్ళాడు. అతడు అలా పైకివెళ్ళి, ఆ గదిలో ఒకచోట పద్మాసనం వేసుకుని కూర్చుని ఆపై మహాయాన బౌద్ధమతంలో చెప్పబడిన కొన్ని తాంత్రిక మంత్రాలను మధ్యస్థాయి స్వరంతో పఠించటం మొదలు పెట్టాడు. ఆ తరువాత 10 నిమిషాలకు ఒక పొగ ఆకారంలో 'ఓ-సోనో' ఆత్మ ఆ గదిలోకి ప్రవేశించింది. ఆపై ఆమె కొంతవరకు మానవదేహం కలిగిన ఒక పొగలాంటి తెల్లటి రూపాన్ని ధరించి, ఆ గదిలోని బీరువావైపు వెళ్ళింది. అది గమనించిన ఆ వృద్ధపూజారి డైజన్, ప్రేతాత్మలను కట్టడిచేసే కొన్ని మంత్రాలను బిగ్గరగా చదివాడు. ఆ మంత్రాల బలంవల్ల 'ఓ-సోనో' ఆత్మ కొంచెం భయానికి గురై, ఆపై వృద్ధపూజారి దగ్గరగా వచ్చి నిలబడింది. వృద్ధపూజారి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసాడు. ఆ ముఖంలో, ఏదో తెలియని వేదన ఆ పూజారికి కనిపించింది. ఆపై ఆ పూజారి మృదువైన స్వరంతో 'ఓ-సోనో' ప్రేతాత్మతో ఇలా అన్నాడు.
"బిడ్డా! నీవు ఏదో కారణంగా ప్రేతాత్మగా మారి మళ్ళీ మళ్ళీ ఈ గదిలోకి వస్తున్నావు. నీ సమస్య ఏమిటో చెబితే నేను నీకు సహకరిస్తాను. ఆపై నీ ఆత్మ శాంతిస్తుంది". అప్పుడు 'ఓ-సోనో' ప్రేతాత్మ విచిత్రంగా నవ్వుతూ ఆ వృద్ధపూజారికేసి చూసింది. సాధారణంగా ప్రేతాత్మలు మాట్లాడగలిగే శక్తిని కలిగి ఉండవు. కానీ, అవి తలచుకుంటే తమ భావాల ద్వారా తమ ఉద్దేశాన్ని ఎదుటివారికి తెలియజేయగలవు. ఇక్కడ కూడా 'ఓ-సోనో' ప్రేతాత్మ తాను ఎందుకు ఆ గదికి మళ్ళీ మళ్ళీ వస్తున్నదో మాటలతో చెప్పనప్పటికీ, ఆ బీరువాకు ఉన్న ఒక అరలో తన కావలసిన వస్తువు ఉన్నది అని తన మనసులోని భావాన్ని (టెలీపతి ద్వారా) ఆ
వృద్ధపూజారికి తెలియజేసింది. ఆమెకు కావలసిన వస్తువు ఏదో ఆ బీరువాలో ఉన్న ఒక అరలో ఉన్నదని ఆ వృద్ధపూజారికి స్పష్టంగా అర్ధమయ్యింది. ఆపై ఆయన పద్మాసనం నుండి లేచి, ఆపై ఆ బీరువా వద్దకు వెళ్ళి బీరువాకు ఉన్న ఒక్కొక్క అరను తన బలం ఉపయోగించి తెరవటం ప్రారంభించాడు. ఆవిధంగా ఒకటి, రెండు, మూడు, నాలుగు అరల్ని వరుసగా తెరచి అందులో ఏమన్నా వస్తువులు ఉన్నాయేమో అని పరిశీలనగా చూసాడు. అందులో ఏమీ లేవు. ఆ తరువాత ఆయన ఏం చెయ్యాలో అర్ధంకాక 'ఓ-సోనో' వైపు ప్రశ్నార్ధకంగా చూసాడు. 'ఇంకా వెతుకు' అన్నట్లుగా ‘ఓ-సోనో' ప్రేతాత్మ తన తలను ఊపింది. ఆ బీరువాకి ఉన్న నాలుగు అరల్ని అప్పటికే సంపూర్తిగా పరిశీలించిన ఆ పూజారి మళ్ళీ ఆ నాల్గవ అర లోపల తన రెండు చేతులతో బలంగా తడిమాడు. అప్పుడు ఆయనకి ఆ నాల్గవ అరలో చాలా చిన్న పరిమాణంలో అమర్చబడిన ఒక చిన్న అర కనపడింది. అప్పుడు ఆ పూజారి అతి సన్నగా ఉన్న ఆ అరను అతికష్టంమీద తెరచి చూడగా దాంట్లో ఒక చిన్న ఉత్తరం కనిపించింది. ఆ పూజారి ఆ ఉత్తరాన్ని బైటకుతీసి, ఆపై దానిని ఆమెకు చూపిస్తూ "దీనికోసమేనా నీవు మళ్ళీ మళ్ళీ ఈ గదిలోకి వస్తున్నావు?. 'ఓ-సోనో’ ప్రేతాత్మ ఆ ఉత్తరంకేసి తీక్షణంగాచూసి విచిత్రంగా నవ్వింది. ఆమె ప్రేతాత్మ ఆ ఉత్తరంకోసమే మళ్ళీ మళ్ళీ వస్తున్నదని గ్రహించిన ఆ పూజారి గంభీరమైన స్వరంతో ఆమె ఇలా అన్నాడు.
"బిడ్డా! బాధపడకు. ఈ ఉత్తరాన్ని రేపు ఉదయం బుద్ధుడి ఆలయంలో వెలిగే దీపారాధనలో కాల్చివేస్తాను. ఈ ఉత్తరాన్ని ఎవరికీ చూపించను". ఆ పూజారి అలా చెప్పటంతో 'ఓ-సోనో' ప్రేతాత్మ ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత కనపడింది. ఆ తరువాత 'ఓ-సోనో' ప్రేతాత్మ అక్కడ నుండి వెళ్ళిపోయింది. కొంతసేపు గడిచిన తరువాత ఆ వృద్ధపూజారి ఆ ఉత్తరాన్ని తన దుస్తుల్లో రహస్యంగా దాచుకుని, ఆపై క్రిందకువచ్చి అక్కడ తన రాకకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న నగరాయ మరియు అతని కుటుంబ సభ్యులతో ఇలా అన్నాడు.
“నేను తంత్రపరమైన ప్రక్రియలను చేసాను. దాంతో 'ఓ-సోనో' ప్రేతాత్మ శాంతించింది. నా అభిప్రాయం ప్రకారం ఆమె ఇక తిరిగి రాదు. మీరు ఇక నిశ్చింతగా ఉండండి". ఆపై ఆ వృద్దపూజారి ఆ ఇంటి నుండి బైలుదేరి బుద్ధుడి ఆలయానికి చేరుకున్నాడు. మర్నాడు ఉదయం ఇతర భక్తులు ఆ ఆలయానికి రావటానికి ముందే ఆ వృద్ధపూజారి, 'ఓ-సోనో’ ఇంటి నుండి తెచ్చిన ఉత్తరాన్ని తెరిచి చదివాడు. ఆ ఉత్తరంలో ఏమి ໖....?
“ఓ-సోనో' నాగరికతను నేర్చుకునే స్త్రీల కళాశాలలో విద్యార్ధినిగా ఉన్న సమయంలో ఒకసారి ఆమె తోటి పురుష విద్యార్ధి ఆమెకు ఒక ప్రేమలేఖ వ్రాసాడు. ఆ ప్రేమలేఖను చదివిన 'ఓ-సోనో' కూడా అతడిని ప్రేమించింది. అయితే ఆ విషయాన్ని తండ్రికి చెప్పే ధైర్యంలేక తన మనసులోనే దాచుకుని తండ్రి చెప్పిన నగరాయను వివాహం చేసుకున్నది. అయితే తాను తొలిసారిగా ప్రేమించిన ఆ ప్రేమికుడు వ్రాసిన ఉత్తరాన్ని ఒక అమూల్య కానుకగా భావించి, ఆమె దానిని తన దగ్గర రహస్యంగా దాచుకున్నది. తాను చనిపోయింది కనుక ఏదోఒక సమయంలో తన భర్త మరియు అతని కుటుంబీకులకు ఆ ఉత్తరం దొరుకుతుందని, ఆ ఉత్తరాన్ని చదివిన తన భర్తకు తనమీద చెడు అభిప్రాయం కలుగుతుందని భయపడిన 'ఓ-సోనో' ప్రేతాత్మ ఆ ఉత్తరాన్ని నాశనం చెయ్యటంకోసం మళ్ళీ మళ్ళీ తన ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ ఉత్తరాన్ని బీరువాలోంచి బైటకు తియ్యటం ఆమె ఆత్మకు సాధ్యంకాలేదు. ఎప్పుడైతే ఆ వృద్ధపూజారి ఆ ఉత్తరాన్ని తాను తీసుకుని, ఆపై దానిని ఎవరికీ కనపడకుండా నాశనం చేస్తానని చెప్పాడో ఆ క్షణమే 'ఓ-సోనో' ప్రేతాత్మకి శాంతి కలిగింది. ఆపై ఆమె, ఆ ప్రేతాత్మ రూపాన్ని వదిలిపెట్టి పుణ్య లోకాలకు వెళ్ళిపోయింది. ఆ ఉత్తరాన్ని చదివి, 'ఓ-సోనో' యొక్క ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న ఆ వృద్ధ పూజారి ఆ ఉత్తరాన్ని అక్కడ వెలుగుతున్న దీపారాధనలో కాల్చివేసాడు. ఆయన బ్రతికి ఉన్నంతకాలం ఆ ఉత్తరం రహస్యం ఆయనలోనే నిలిచిపోయింది.
NOTE: ఎవరు కాపీ రైట్ ఇవ్వ్వకండి ఇది వినోదం అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అందరికి ఫ్రీ గ అందించాలి అని షేర్ చేస్తున్నం మీరు ఎమన్నా మాకు తెలియా చేయాలి లేదా మీ ఆర్టికల్స్ డిలీట్ చేయాలి అంటే మెయిల్ చేయండి -- contact
NOTE : No one give copy right this is only for entertainment and education purpose sharing free to all you should let us know or delete your articles mail-- contact
The content I uploaded is not available in any website so I uploaded it on them if the content I uploaded is yours then contact me everyone
0 Comments