Ad Code

Responsive Advertisement

ఒక్క చిన్న మాట || Itsmekriish

 



మంచి గురువును వెతుక్కుంటే జీవితం ధన్యమవుతుందని గోపీకి కొందరు సలహా ఇచ్చారు. గోపి అమాయకుడు. గురుకృప ఉంటే బాగుంటుందని అన్వేషణ మొదలు పెట్టాడు. చుట్టు పక్కల పేరుగాంచిన ఒక గురువును కనిపెట్టాడు. అతని దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడ్డాడు.

"స్వామీ మీరే ఈ దీనునికి మార్గం చూపించాలి. ఎలా జీవించాలో తెలియజెప్పాలి, నన్ను నేను మీ పాదాలదగ్గర అర్పించుకుంటున్నాను” అని ప్రార్థిం చాడు. “నిన్ను నాకు సమర్పించుకున్న తర్వాత నీకు అన్నీ సమకూరుతాయి. నీకు ఏ ఇబ్బందీ ఉండదు. నా నామమే నీ మంత్రం. దానిని మననము చేసుకో. అన్నీ సిద్ధిస్తాయి" అని గురువు ఆశీర్వదించాడు.

గోపి అతని పాదాలకు నమస్కరించి బయలు దేరాడు. గురువును మనసారా నమ్మాడు. అతని నామం ఉచ్చరిస్తున్నాడు. ఆ శక్తిని పరీక్షించాలని నీటిమీద నడవాలనుకున్నాడు. నడిచాడు. ఇతర శిష్యులు ఇది చూసి ఆశ్చర్యపోయారు. పరుగుపరుగున గురువు

వద్దకు వెళ్ళి ఈ విషయం తెలిపారు.

ఇది విని గురువూ ఆశ్చర్యపోయాడు. అం దరూ నదివద్దకు వెళ్ళారు. గోపీ ఆనందంగా పాటలు పాడుకుంటూ నీటిమీద నడుస్తు న్నాడు. వీరిని చూసి తీరానికి వచ్చాడు. "గోపీ నీటిమీద నడిచే శక్తినీకెక్కడిది? ఏమిటా రహ స్యం?" అని గురువు అడిగాడు.

"గురువర్యా నా వద్ద మీరిచ్చిన వరంగాక మరే రహస్యమూ లేదు. మీ నామ మంత్రమే నా శక్తి రహస్యం" అన్నాడు గోపి.

గురువుకు నమ్మశక్యం కాలేదు. తానెన్నడూ నీటిమీద నడవలేదు. ఆ ఆలోచనే రాలేదు. "గోపీ నీ శక్తిమీద నీకు అంత నమ్మకము వుంటే ఈ కొండ మీదనుండి కిందకు దూకగలవా?" అన్నాడు గురువు.

"స్వామీ మీ ఆజ్ఞ” ఏమాత్రం సంకోచించ కుండా గోపీ కొండమీదనుండి దూకాడు. ముక్కముక్కలైన అతని శరీరమే కనిపిస్తుం దని అందరూ అనుకుంటూ పరిసరాలు వెతి కారు. పద్మాసనంలో చిరునవ్వుతో గోపీ ఒక చెట్టు కింద కనిపించాడు.

"ఇదంతా ఎలాసాధ్యం గోపీ" అని గురువు అడి గాడు.“మీ నామ మహిమేస్వామీ!" అన్నాడు గోపి. గురువుకు తన మీద అపారమైన నమ్మకం కుది

రింది. తాను కూడా నీటిమీద నడిచి తన మహిమ ప్రదర్శించాలనుకున్నాడు. నీటిమీద అడుగువేయగానే మునిగిపోసాగాడు. చుట్టూ ఉన్నవాళ్ళు అతనిని కాపా డారు. “ఇదేమిటి స్వామీ” అని గోపీ అడిగాడు.

"గోపీ నాకు ఏ మహిమలూ లేవు. నాకు తోచింది ఇతరులకు చెప్పాను. వారు నమ్మి నన్ను గొప్పవాడినని పొగిడారు. దానితో నేనూ గొప్పవాడిననే భావించాను. ఈ రోజు నిజం తెలిసివచ్చింది"

"ఇదెలా జరిగింది గురువర్యా? మీ నామ మంత్రం జపిస్తేనే నాకింత శక్తివచ్చింది కదా!"

"గోపీ నీవు అమాయకుడివి. నీవు నన్ను విశ్వసిం చావు. సంపూర్ణంగా నమ్మావు. నిన్ను నీవు అర్పించు కున్నావు. నీ శక్తి అంతా నీ విశ్వాసంవల్ల ఒనకూడింది" అని గురువు సమాధానమిచ్చాడు.

పురాణాల్లో దేవుని మించిన శక్తితో దేవునితో పోరాడి గెలిచిన భక్తులు కనిపిస్తారు. ఇలాంటి కథను వింటే మనకు విశ్వాసంమీద విశ్వాసం పెరుగుతుంది. ఆత్మార్పణకున్న శక్తి విదితమవుతుంది. మన పొర పాట్లు దుఃఖానికి హేతువైతే, మన ప్రేమ, విశ్వాసం ఆనందానికి మార్గం చూపిస్తాయని తెలియవస్తుంది. సంబంధాలను పటిష్ఠంగా ఉంచేది, నాయకునికి, అనుయాయులకు మధ్య బంధం ఏర్పరచేది నమ్మకం.


ఆ నమ్మకం నిజాయితీమీద ఆధారపడి ఉంటుంది. దీనిని కొందరు రక్తపీడనతో పోలుస్తుంటారు. మంచి ఆరోగ్యానికి ఇది అవసరం. కాని తగ్గినా, ఎక్కినా ప్రాణాంతకమే. మనల్ని మనం నమ్ముకోటం కూడా జీవించటానికి అవసరమే.

విశ్వాసం, నమ్మకం మాటకొస్తే ఒక సందర్భంలో మహాత్మాగాంధీ నమ్మకానికి లేదా విశ్వాసానికి సంబం ధించి ఒక మాట చెప్పారు. దేనిని దేవుడని భక్తితో పూజించినా లేక ప్రార్థించినా అక్కడే దేవుడు ఉంటాడు. సర్వవ్యాపి కదా! అందుకే చెట్టును, పుట్టను,సూర్యుణ్ణి, చంద్రుణ్ణి,మనిషిచేసిన బొమ్మల్ని ఆరాధించేవారిని తప్పుపట్టకూడదు. ఎవరి విశ్వాసం వారిది.

ఎన్నో చీకటి క్షణాలలో ప్రార్థనచేసి శాంతిని పొందిన వారు కోకొల్లలు. పుణ్యక్షేత్రాలలో వెలిసిన దేవుళ్ళ మహిమలు కొనియాడుతూ "ఆ స్వామి మహిమగల స్వామి, ఈ దేవత కోరిన కోరికలు తీరుస్తుంది" అనే ప్రజాభిప్రాయం ఉంటుంది.


తార్కికంగా ఇది నిలబడకపోవచ్చు. విజ్ఞానశాస్త్ర సంబంధమైన ఆధారాలు లేకపోవచ్చు. ఇక్కడ పని చేసేది విశ్వాసం. వేలాది, లక్షలాది ప్రజలు ఎంతో విశ్వా సంతో, ఎంతో భక్తితో ఒక క్షేత్రాన్ని దర్శించినప్పుడు వారి సంయుక్త విశ్వాసం, భక్తి భావం శక్తిసంపన్నంగా ఉంటుంది. అది వారికి సానుకూలంగా కూడా సరి ణమిస్తుంది. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ వంటి విజ్ఞాని ప్రార్థనగురించి, విశ్వాసంగురించి ఈ మాటలు చెపు తారు. "మన సృష్టికర్త,దేవుడు మన మనస్సుల్లో, వ్యక్తి త్వాలలో గొప్పశక్తిని, సామర్థ్యాన్ని నింపాడు.

ప్రార్థనవల్ల ఈ శక్తులను ఉత్తేజపరచి వాటిని మరింతగా అభివృద్ధిచేసుకోగలము” అని.

మనం ప్రార్థించేటప్పుడు అంతా భగవంతుని మీదే ఆధారపడినట్లు ప్రార్థించాలట. పనిచేసేటప్పుడు అంతా మనమీదే ఆధారపడినట్లు పనిచేయాలట. ఇది పెద్దల సలహా. ఇంకా ఉదయకిరణాలు రాక ముందే, చీకటి విడవక ముందే వెలుగును అనుభ వించే పక్షిలాంటిది విశ్వాసమని రవీంద్రనాథ్ ఠాగూర్ భావన, విశ్వాసంతో దెబ్బతిన్నా కోలుకుని ముందుకు పోగలిగే శక్తి లభిస్తుంది. మనకన్నా ఉన్నతమైన దాని పట్ల విశ్వాసం మనకు స్ఫూర్తిదాయకంగా, దృఢనిశ్చ యంతో ముందుకు సాగేటట్లు చూస్తుంది.

నమ్మ చెడినవారు లేరని చెపుతారు. ఇతరులను నమ్మి బాధలపాలయినవారు ఎందరో ఉంటారు. మోసాలు, ఇతరులను స్వలాభానికి ఉపయోగించు కోటంవంటివి మన నమ్మకాన్ని, ఇతరులపట్ల విశ్వా సాన్ని వమ్ముచేస్తాయి. అందరు చెప్పిందీ నమ్మలేము. అరచేతిలో వైకుంఠం అంటే ఆశపడకూడదు.

Download Your Movie


నమ్మకం, విశ్వాసం గుడ్డిగా ఉండకూడదు. మెలు కువతో ముందడుగుపడాలి. నిశితంగా చూస్తే నమ్మ కమే మనకు మూలమాత్రంగా ఉంటుంది. అందుకే జీవిస్తున్నాము. ఊపిరి తీసుకుంటున్నాం.


NOTE: ఎవరు కాపీ రైట్ ఇవ్వ్వకండి ఇది వినోదం అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అందరికి ఫ్రీ గ అందించాలి అని షేర్ చేస్తున్నం  మీరు ఎమన్నా మాకు తెలియా చేయాలి లేదా మీ ఆర్టికల్స్ డిలీట్ చేయాలి అంటే మెయిల్ చేయండి -- contact

NOTE : No one give copy right this is only for entertainment and education purpose sharing free to all you should let us know or delete your articles mail-- contact

The content I uploaded is not available in any website so I uploaded it on them if the content I uploaded is yours then contact me everyone 


Article by : Dr. J Bhagyalakshmi

Email : jbhagyalakshmi43@yahoo.in

Post a Comment

0 Comments

Close Menu