TG: CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవి SMలో లీక్ అయితే MLA మల్లారెడ్డే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.
#2 ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదు: మస్క్
లాస్ వెగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ బయట నిన్న జరిగిన టెస్లా సైబర్ ట్రక్ పేలుడు ఘటనపై ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదని చెప్పారు. దీనిపై టెస్లా సీనియర్ టీమ్ విచారణ చేస్తున్నట్లు, ఘటనకు గల కారణం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో పంచుకుంటామని చెప్పారు. సైబర్ ట్రక్ పేలిన ఘటనలో ఒకరు చనిపోగా, ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే.
0 Comments