కలకత్తాలో దయ్యం పట్టిన బాలుడు?
దాదాపు 110 సంవత్సరాల క్రితం కలకత్తా పట్టణంలో జరిగిన
యదార్ధ గాధ ఇది. ఆ కాలంలో కలకత్తాలో బిస్వజిత్ అనే ఒక సంపన్నుడు
ఉండేవాడు. ఒక సమయంలో 7 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన
కొడుక్కి ఒక రోజు సాయంత్ర సమయంలో విపరీతమైన జ్వరం వచ్చింది.
ఆ జ్వరం కారణంగా అతడు ఏవే ఏవో మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడి,
ఆ తరువాత అక్కడ ఉన్న ఎవరికీ అర్ధంకాని ఒక కొత్త భాషలో మాట్లాడటం
ప్రారంభించాడు. విపరీతమైన జ్వరం కారణంగా కొంతమంది 'సంధి
ప్రేలాపన' (డెలీరియం) చేస్తూ ఉంటారు. ఈ బాలుడు కూడా అలా
చేస్తున్నాడని ఆ బాలుడికి వైద్యం చేస్తున్న వైద్యుడు అనుకున్నాడు. అయితే
ఆ సమయంలో అక్కడ ఉన్న ఆ సంపన్నుడి బంధువులలో కొందరికి ఆ
బాలుడు మాట్లాడుతున్నది ఒకరకమైన ఇంగ్లీషు భాష అని అనిపించింది.
అయితే ఆ మాటలకు అర్ధం ఏమిటో వాళ్ళకి తెలియలేదు. ఒక విచిత్రం
ఏమంటే... అప్పటికి ఒకటవ తరగతో లేదా రెండవ తరగతో చదువుతున్న
ఆ బాలుడికి కొద్దిగా బెంగాలీ మాత్రమే తెలుసు. ఇంగ్లీషు ఏమాత్రం
తెలియదు. అలాంటిది ఆ బాలుడు ఇంగ్లీషును పోలిన ఉన్న భాషలో
మాట్లాడటం అక్కడ ఉన్నవారందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు
ఏం చెయ్యాలా? అని డాక్టరు ఆ బాలుడికేసి పరిశీలనగా చూస్తున్నాడు.
అప్పటి వరకు ఆ గదిలోని బెడ్మీద కళ్ళుమూసుకుని పడుకుని ఏవేవే
మాట్లాడుతున్న ఆ బాలుడు హఠాత్తుగా "డాక్టర్! నాకు చాలా ఆకలిగా
ఉన్నది. వెంటనే ఏదైనా ఆహారం తెప్పించు" అన్నాడు.
అప్పుడు ఆ డాక్టరు ఆ బాలుడి తల్లివైపు చూస్తూ “ఈ పిల్లవాడికి
ఆఖరిసారి ఆహారం ఎప్పుడు పెట్టారు?" అన్నాడు. “అతడికి దాదాపు 10
గంటల క్రితం రెండు రొట్టెలు తినటానికి ఇచ్చాను. ఆ తరువాత ఏమీ
పెట్టలేదు" అన్నది ఆమె. అప్పుడు ఆ డాక్టరు ఆ బాలుడి బెడ్ దగ్గరకు
వెళ్ళి ఆపై ఆ బాలుడితో ఇలా అన్నాడు. "నీకు తినటానికి ఏమి కావాలో
చెప్పు వెంటనే తెప్పిస్తా". అప్పుడు ఆ బాలుడు "వేయించిన మాంసం
మరియు అన్ని రకాల కూరగాయ ముక్కలు కావాలి" అన్నాడు. అప్పుడు
ఆ డాక్టరు ఆ బిడ్డ నుదుటిమీద చెయ్యివేసి "బాబూ! నీకు ప్రస్తుతం చాలా
జ్వరంగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మాంసం వేపుడు తింటే నీకు
ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది తెలుసా?" అన్నాడు. అప్పుడు ఆ బాలుడు
కళ్ళు ఏమాత్రం తెరవకుండా విచిత్రమైన స్వరంతో "డాక్టర్! నాకు ఆ
ఆహారం తీసుకుంటే మంచే జరుగుతుంది. ముందు నేను చెప్పినవి
తెప్పించండి" అన్నాడు. ఆ బాలుడు మాట్లాడుతున్నది ఫ్రాన్స్ దేశంలో
మాట్లాడే ఇంగ్లీషు అని ఆ డాక్టరుకి అప్పటికి అర్ధమయ్యింది. కానీ ఏడు
సంవత్సరాల వయస్సు ఉన్న ఆ బాలుడికి ఫ్రెంచివాళ్ళు మాట్లాడే ఇంగ్లీషు
ఎలా వచ్చిందో? ఎంతమాత్రం అర్ధంకాలేదు. ఆ డాక్టరు అప్పటికే
ఐరోపాలోని అనేక దేశాలు తిరిగివచ్చాడు. ఆయనకు పారాసైకాలజీలో
కూడా మంచి ప్రవేశం ఉన్నది. ఈ బాలుడిని ఎవరో ఫ్రెంచిదేశస్తుడియొక్క
ప్రేతాత్మ ఆవహించి, అతడి ద్వారా మాట్లాడుతున్నదని మరియు ఆ ప్రేతాత్మ
తన శరీరాన్ని ఆవహించిన కారణంగా ఆ బాలుడికి విపరీతమైన జ్వరం వచ్చిందని
ఆ డాక్టరుకి కొంచెంసేపటి తరువాత అర్ధమయ్యింది. దాంతో ఆయన ఆ బాలుడిని
ఆవహించి ఉన్న ప్రేతాత్మను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు.
వచ్చిందని ఆ డాక్టరుకి కొంచెంసేపటి తరువాత అర్ధమయ్యింది. దాంతో ఆయన ఆ
బాలుడిని ఆవహించి ఉన్న ప్రేతాత్మను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు
జనరల్ని" అన్నాడు. అప్పుడు ఆ డాక్టరు "నువ్వు జనరల్్వ అని మేము త నమ్మాలి. అందుకు రుజువు ఏంటి?"
అన్నాడు. అప్పుడు ఆ బాలుడు చెప్పాదు నేను అడిగినవి తెప్పించు. అవి తిన్న తరువాత
నేను ఎవరో సాంకేణుతాను" అన్నాడు. అప్పుడు ఆ డాక్టరు ఆత్రుతతో నిండిన స్వరంతో "తో "
నువ్వు జనరల్ ఆత్మవే అని నాకు నమ్మకం కుదిరిన తరువాతే
ఇక కొద్ది నిమిషాలలోనే ఆ బాలుడు అడిగిన మాంసం వేపుడు వచ్చింది.
అప్పుడు ఆ డాక్టరు, ఆ బాలుడితో మాంసం వేపుడు వచ్చిన విషయం చెప్పాడు.
అప్పుడు ఆ బాలుడు కళ్ళు తెరవకుండానే ఇలా అన్నాడు. "ఈ మాంసం వేపుడుని
ఒక వెదురు బుట్టలో పెట్టి ఆపై ఆ బుట్టకి ఒక తాడుకట్టి బావిలో ఉన్న నీటిపై ఆనించి
ఉంచమని చెప్పు". ఆ బాలుడు చెప్పినట్లుగానే ఒక పనివాడు ఆ మాంసం వేపుడిని,
కూరగాయ ముక్కల్ని ఒక బుట్టలో పెట్టి ఆపై ఆ బుట్టకు ఒకతాడుకట్టి బావిలోకి ఆ
బుట్టను దింపాడు. ఆపై ఆ బుట్ట నీళ్ళల్లో మునుగుతున్నదా? లేదా? అని ఒకసారి
బావిలోకి తొంగి చూసాడు. అప్పుడు ఆ బావిలోంచి ఒక విచిత్రమైన స్వరం ఇలా
అన్నది.
"ఇందులో ఉప్పులేదు. వీటిని వెంటనే బైటకు తీసెయ్". బావిలో నుండి తనకు
వినపడిన మాటలను, ఆ పనివాడు లోపలికి వెళ్ళి వంటవాడికి చెప్పాడు. తాను
మాంసం వేపుడులో ఉప్పువేయనిమాట వాస్తవమే అని ఆ వంటవాడు ఒప్పుకున్నాడు.
ఆ తరువాత ఆ పనివాడు బావిలో తాడుద్వాకు వేలాడుతున్న మాంసంవేపుడు ఉన్న
బుట్టను బైటకుతీసి వంటవాడికి లో ఇచ్చాడు. అప్పుడే వంటవాడు ఆ వేపుడుకి
సరిపడా ఉప్పును కలి హంసం
తేలేదాకా దింపాడు. అలా నీటిపై వ్రేలాడుతున్న ఆ బుట్టను ఏదో ఒక అదృశ్య
హస్తం, బావి అడుగు నుండి లాగినట్లుగా ఆ బుట్ట బలంగా నీళ్ళ అడుగుక్కి లాగబడింది.
బావి గట్టుమీద నుంచుని ఆ తాడు మొదటి భాగాన్ని తన చేత్తో పట్టుకుని ఉన్న ఆ
పనివాడు జాగ్రత్త పడకపోయినట్లయితే వాడుకూడా ఆ గుంజుడికి బావిలో పడిపోయేవాడే.
ఏదిఏమైనా వాడు క్షేమంగా బావి దగ్గర నుండి ఇంట్లోకి వచ్చాడు.
'బావిలోకి ఆహారం ఉన్న బుట్ట గుంజబడింది' అని పనివాడి ద్వారా తెలుసుకున్న
ఆ ఇంట్లోని కొందరు వ్యక్తులు బావిలో ఎవరో దాక్కుని ఉంటారని భావించి చాలావేగంగా
ఆ బావి దగ్గరకువెళ్ళి, ఆపై బావి అడుగు దాకా వెళ్ళి గాలించారు. అక్కడ ఎవరూ లేరు.
ఆ తరువాత వాళ్ళు అందరూ ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోయారు. సరిగ్గా అరగంట తరువాత
కెప్టెన్ కపూర్ మరో ఇద్దరు ఇంగ్లీషు అధికారులను వెంటపెట్టుకుని ఆ సంపన్నుడి
ఇంటికి వచ్చాడు. ఆపై ఆ సంపన్నుడు ఆ కెప్టెన్ని మరియు ఇంగ్లీషు అధికారులను,
గదిలో మంచంమీద పడుకుని ఉన్న తన కొడుకు దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ బాలుడు
ఏమాత్రం కళ్ళు తెరవకుండానే గంభీరమైన స్వరంతో “గుడీవినింగ్ కెప్టెన్' కపూర్. నేను
జనరల్ రాబర్ట్న అని ఇక్కడ వాళ్లకు చెబుతుంటే ఇక్కడ ఎవరూ నమ్మటంలేదు. నేను
ఎవరో వీళ్ళకు స్పష్టంగా తెలియజెయ్”.
ఒక చిన్న బాలుడి నోటి నుండి అలాంటి మాటలు రావటం కెప్టెన్ కపూర్కి మరియు
ఆయనతో వచ్చిన ఇద్దరు ఆంగ్లేయ అధికారులకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించింది.
అప్పటికే ఆ బాలుడి విచిత్రమైన మాటలకు అలవాటు పడిన మిగిలినవాళ్ళు అప్పుడు
ఏ ఆశ్చర్యానికీ గురికాలేదు. అప్పుడు కెప్టెన్ కపూర్ మిలటరీకి సంబంధించిన కొన్ని
క్లిష్టమైన ప్రశ్నలను ఆ బాలుడిని అడిగాడు. ఆ బాలుడు ఏమాత్రం తడుముకోకుండా
వెంట, వెంటనే ఆ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు చెప్పాడు. మిలటరీలో ఎంతో
అనుభవం ఉన్నవారికి మాత్రమే తెలిసే ఆ సాంకేతిక విషయాలను ఏడు సంవత్సరాల
బాలుడు టక టకా చెప్పటంతో
కెప్టెన్ కపూర్ మరియు ఆయనతో వచ్చిన ఇద్దరు ఆంగ్లేయ అధికారులు
నిర్ఘాంతపోయారు. అప్పుడు ఆ బిడ్డ ఏ మాత్రం కళ్ళు తెరవకుండా అక్కడ
ఉన్నవారందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.
"మీరందరికీ నేను జనరల్ రాబర్ని అని నమ్మకం కలిగితే మీరు
నన్ను ఏమైనా ప్రశ్నలు నిరభ్యంతరంగా వెయ్యవచ్చు". అప్పుడు
భారతీయ డాక్టరు స్వచ్ఛమైన ఆంగ్లంలో ఆ బాలుడితో ఇలా అన్నాడు.
“జనరల్! నీవు ఎంతో గొప్పస్థాయి అధికారివి. అలాంటి నీవు ప్రేతాత్మగా
మారి ఒక చిన్న బాలుడిని ఆవహించి పీడించటం నీకు న్యాయంగా ఉన్నదా?"
అప్పుడు ఆ బాలుడు ఇలా అన్నాడు. ఈ సంపన్నుడికి చెందిన ఒక పొలంలో
ఉన్న నా సమాధిమీద ఒక చెట్టు విరిగి పడింది. ఫలితంగా నా సమాధి పగిలిపోయింది.
ఈ సంపన్నుడు నా సమాధిని బాగుచేయించినట్లయితే నేను ఈ బాలుడిని వదిలిపెట్టి
తప్పకుండా వెళ్ళిపోతాను". అప్పుడు ఆ సంపన్నుడు వేగంగా ఆ బాలుడి ముందుకు
వచ్చి ఇలా అన్నాడు.
"జనరల్! నేను వెంటనే ఆ సమాధిని బాగుచేయిస్తాను". అప్పుడు ఆ బాలుడు ఇలా
అన్నాడు. "నీవు నా సమాధిని బాగు చేయించినట్లయితే నేను ఒక వారంలోగా నీ
కొడుకుని వదిలిపెట్టి వెళ్ళిపోతాను”. అన్న మాట ప్రకారమే ఆ సంపన్నుడు
మర్నాడు సాయంత్రం లోగా తన పొలంలో ఉన్న సమాధిని చక్కగా బాగుచేయించాడు.
ఆ తరువాత ఐదు రోజులకు జనరల్ ఆత్మ ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
ఆ తరువాత ఏ రోజూ ఆ బిడ్డకు చిన్న అనారోగ్యం కూడా రాలేదు.
(నోట్ : కలకత్తాలో ఆనాడు యదార్ధంగా జరిగిన ఈ సంఘటన వివరాలు ఆనాడు
అలహాబాద్ నుండి ప్రచురించబడిన 'ది లీడర్' అనే వార్తా పత్రికలో క్రీ.శ.1906
జూలై 15వ తేదీన ప్రచురించబడింది. ఈ వృత్తాంతం రచయిత కల్పన అని
అనుమానించినవారు తమకు అవకాశం ఉంటే ఆ సంచికను చూడవచ్చు.)
NOTE: ఎవరు కాపీ రైట్ ఇవ్వ్వకండి ఇది వినోదం అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అందరికి ఫ్రీ గ అందించాలి అని షేర్ చేస్తున్నం మీరు ఎమన్నా మాకు తెలియా చేయాలి లేదా మీ ఆర్టికల్స్ డిలీట్ చేయాలి అంటే మెయిల్ చేయండి -- contact
NOTE : No one give copy right this is only for entertainment and education purpose sharing free to all you should let us know or delete your articles mail-- contact
The content I uploaded is not available in any website so I uploaded it on them if the content I uploaded is yours then contact me everyone
0 Comments