Ad Code

Responsive Advertisement

విజయా వారి... గుండమ్మ కథ part -1 || Itsmekriish

 


నిర్మాతలు  : నాగిరెడ్డి: చక్ర పాణి 


విజయా వారి... గుండమ్మ part - 1 

గుండుగొలను గ్రామం లో గుండమ్మ పేరు తెలియనివాళ్లు ఆ చుట్టుప్రక్కల లేరు. ఆ గంగా భగీరదీ సమానురాలు పేరు చెబితే పాలుత్రాగే పసిపిల్లలు సైతం కేరింతలు కొడుతున్నా, ఆమె పేరు  వింటే గజ గజలాడి పోతారు. చచ్చి ఆమహాను భావుడు గుండుగొలను వెంట్రామయ్య గారు ఏ లోకాన నున్నాడో కాని, గుండమ్మ నోటికి దడిని నలుచదురపు నాణ్యమైన ఫ్రేములో బ్రతికి సుఖం అనుభవించకపోయినా, చచ్చి పూజ లందుకుంటున్నాడు. ఆయన మొదటి భార్య గతించగా రెండో వివాహం చేసుకొని, ఇల్లరికం వొచ్చేశాడు. పెద్ద భార్యకో పిల్ల - పేరు లక్ష్మి, ద్వితీయ మైన గుండమ్మకు ప్రభాకరం, సరోజ అనే యిద్దరు బిడ్డలు.



మారుతల్లి గుండమ్మ - లక్ష్మి ని యింట్లో చాకిరీ చేసే మనిషిగాను, పని చేసే పిల్లగాను, తన సొంత కూతురు సరోజను ముద్దుల పపెడగాను, గారాల బూచిగాను పెంచుతుంది. గుండమ్మ పేరు చెప్పినా, ఆ యింటి సంగతి చెప్పినా ఎవ్వరూ పనికి వొచ్పేవారు




కారు. ఒక వేళ ఒచ్చినా వొకటి రెండు రోజుల్లో పలాయనం పట్టించే వారు. ఎంతమంది వొచ్చిపోయినా లక్ష్మికి మటుకు చాకిరి తప్పేది కాదు. చుక్క పొడిచింది మొదలు చుక్క లొచ్చేవరకు లక్ష్మమ్మ విధివిరామం లేకుండా చాకిరీ చేసేస్తూనే ఉంటుంది.




🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


ఆ వూళ్లోనే కంచు గంటయ్య అనే పాల వ్యాపారి ఉన్నాడు. అసూయకు, ఆశకు నమూనాగా చెప్పుకోదగ్గ వ్యక్తి గంటయ్య. గంటయ్యకు సుపుత్రు డొకడున్నాడు - వారి పేరు భూపతి. వారికి మనుష్యులలో తిరగడం అన్నా, సమాజంలో ఉండాలన్నా సిగ్గేమో : అందుకనే చాలా కాలం పాపం - క్రిష్ణ జన్మస్థానంలో రెస్టు తీసుకుంటుంటాడు. తండ్రికి, కొడుక్కి చుక్కెదురు. కొడుకు మొహం చూస్తే పంచ మహా పాత కా లు గంటయ్య.


గంటయ్య గుండమ్మకు మారన్నయ్య. గంటయ్య భార్య చుక్కమ్మకు, గుండమ్మకూ మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గున మండుతుంటుంది.- ఒకరి మొహాలొకరు చూచుకొని మూడేళ్ళయింది. గుండమ్మ నోరంత దుడుకు కాకపోయినా పట్టుదలకు, ప్రతీకారానికి ఎంత మాత్రం తీసిపోదు.


గుండమ్మ కూతుర్ని తన జైలు పుత్రరత్నం భూపతికిచ్చి ముడి పెట్టాలని గంటయ్య దంపతుల కభిమతం. వని పెట్టుకొని గంటయ్య గుండమ్మ కూతురుకొచ్చే సంబంధాలన్నీ చెడ గొడుతుంటాడు. తన కూతురికి సంబం ధాలు రాలేదని, గుండమ్మ దిగులు పెట్టుకొని పొరుగూరులో రామ భద్రయ్యగారి సంబంధం ఉందని తెలిసి ఓ బ్రాహ్మణ్ని పంపిస్తుంది. రామ భద్రయ్యగారు గుండమ్మ పూర్వాపరాలు అన్నీ తెలుసుకున్నవాడై గుండమ్మ భర్త వెంకట్రామయ్యకూ, తనకూ ఉన్న జోస్తి దృష్ట్యా పిల్లల్ని చూడ టానికి తనే వొస్తానని బ్రాహ్మడితో చెప్పి పంపిస్తాడు. ఆ బ్రా హ్మ డు గంటయ్య విషయం కూడా రామ భద్రయ్యగారి చెవిన వేసి వెళతాడు.


🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟



ఓ మంచిరోజు చూసుకొని రామ భద్రయ్యగారు పెళ్ళికూతుర్ని చూడ టానికి బయలుదేరుతాడు. వాకిట్లోనే గంటయ్య ఎదురుపడతాడు. గుండమ్మ నోరు గురించి ఆయనకు చెపుతాడు. ఆయన పేరూ, వచ్చినపనీ తెలుసుకొని మరికొన్ని నిజాలు, అబద్దాలు కలిపి సంబంధం చెడగొట్టడానికి ప్రయత్ని స్తాడు. లోనికొచ్చిన రామభద్రయ్య గారిని చూడగానే గుండమ్మకు ఏను గెక్కిన సంతోషం వచ్చింది. ఆయనకు అతిధి మర్యాదలు చేసి కూర్చోబెడు తుండగా ఏదో పనిమీద అటొచ్చిన లక్ష్మిని చూసి…

రామ : ఈ అమ్మాయేనా: పోటోలో యింకో మాదిరిగా ఉందే?

గుం: అబ్బే! ఇది మా పని మని షండీ! ఆ అమ్మాయి వేరే ఉంది. ఆలా దేభ్యం మొహం వేసుకొని చూస్తావేం ఈపళ్ళెం లోపల పెట్టు. (అని అచ్చు పని మనిషికి చెప్పినటు లక్ష్మీకి చెప్పింది)

గం: పోయి తీసుకురా అమ్మా యిని.

గుం: అలాగే : వారిని కూర్చోబెటి మాట్లాడుతుండు అన్నయ్యా! పోయి అమ్మాయిని తీసుకొస్తాను. (రామ భద్రయ్యగారు హాలులో వేల్లాడుతున్న ఓ ఫోటో వంక తదేకదృష్టితో చూస్తుం టాడు.)

గం : ఏమిటి అలా చూస్తున్నారు? మా బావగారు కీ ర్తిశేషులయినారు.

రామ: ఈయనది దుర్గాపురం కదూ?

గం: అవును. స్వగ్రామం అదే! వీరి ఆస్తంతా యిప్పటికింకా అక్కడే వుంది. మా చెల్లాయి ఈయనకు రెండో భార్య. తల్లిని వదలి కాపురానికి రానని

ఈమె, వూరు విడిచి ఇల్లరికం రానని ఆయన - చాలా కాలం బీష్మింకుచు కూర్చున్నారు. తరువాత మరి కొద్ది కాలానికి మా బావగారే తగి కూతురుతో యిక్కడికొచ్చి వుండిపోయారు.

తనకో సంబంధం వొచ్చిన సంగతి తెలియక మామూలు అలవాటు ప్రకారం గుండమ్మ గారాల కాణాచి పొద్దుపోయి లేచింది కాక, "అమ్మా ! కాఫీ” అని ముద్దులు గునిసింది. ఈ సంబంధం చెడగొట్టటానికి అంత చక్కటి అవకా శాన్ని చక్కగా వినియోగించదలుచు కున్నాడు గంటయ్య.



🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟




NOTE: ఎవరు కాపీ రైట్ ఇవ్వ్వకండి ఇది వినోదం అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అందరికి ఫ్రీ గ అందించాలి అని షేర్ చేస్తున్నం  మీరు ఎమన్నా మాకు తెలియా చేయాలి లేదా మీ ఆర్టికల్స్ డిలీట్ చేయాలి అంటే మెయిల్ చేయండి -- contact

NOTE : No one give copy right this is only for entertainment and education purpose sharing free to all you should let us know or delete your articles mail-- contact

The content I uploaded is not available in any website so I uploaded it on them if the content I uploaded is yours then contact me everyone 


Post a Comment

0 Comments

Close Menu