నిర్మాతలు : నాగిరెడ్డి: చక్ర పాణి
విజయా వారి... గుండమ్మ part - 2
గం : ఇదే సరోజ. గా రాబాల పెంపకం. పిల్లను అట్లా తయారు చేసింది మా గుండమ్మ ఆడపిల్ల గదా : ఇంట్లో పని పాటల సంగతి అలా ఉంచండి. పొద్దున్నే నిద్రలేస్తే అరిగి పోతుందని ఆమె భయం. సంబంధాలు తేలేదు, తేలేదు అంటుంది- తెస్తే ఇదీ వరస. ఛ-ఛ : బుర్ర ఉన్నవాడెవడైనా చేసుకుంటాడా ఈ అవతారం చూస్తే:
రామ : గంటయ్యగారూ ! మీ కు మొగపిల్లలు లేరూ ?
గం : అడిగారూ! అడుగుతారు తెలివిగలవా ళ్ళెవరై నా అడుగుతారు. రామభద్రయ్యగారూ! సాటి పెద్ద మను షులు మీతో అబద్ధం ఎట్లా ఆదేది.
రేపైనా గంటయ్యామాట మాత్రం చెప్ప లేదే అంటే నేనేమైనా పోవాలి? నిజం చెబుతా వినండి ! నాకు కొడుకున్నాడు. వాడు చాలా ఆత్మాభిమానం కలవాడు. ఇలాంటి పిల్లను చేసుకొని ఇల్లరికం ఉండమంటే వాడు మాత్రం. ఎలా ఉంటాడు? నేను మాత్రం ఎంతో చెప్పి చూశాను: లాభం లేకపోయింది.
రామ : అంటే మీకు అక్కరలేని సంబంధం మ మ్మ ల్ని చేసుకోమం టారా?
గం: అదే కదండీ నా బాధ-కరవ మంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం. ఏమో : నా నోటితో నేనేం చెప్పను బాబూ!
మేడమీద గుండమ్మగారు పెండ్లి కూతురు సరోజను నగ నాణ్యాలతో, తమ సంపదంతా కనిపించేలాగున ముస్తాబు చేస్తారు. సరోజకు మాత్రం ఈ పద్దతి నచ్చక "ఏమిటమ్మా ఇది? నేనేం సంతలో గొడ్డనుకున్నావా వచ్చిన వాళ్ళంతా చూసిపోవడానికి. నే రాను"
అంటున్నా మారుకూతురు లక్ష్మి, గుండమ్మ కలసి పెళ్ళికూతురు సరో జను కిందకు పంపుతారు. రుసరుస లాడుతూ వొచ్చి రామభద్రయ్యగారి ఎదట ఉడికిపోతూ నిలబడుతుంది.
గం: చూడండి: పిల్ల బంగారు బొమ్మ.
రామ : వెళ్ళొచ్చు.
గం : అమ్మాయినేమయినా అడ
గండి :
రామ : నీ పేరేంటమ్మా?
స: సరోజ.
రామ : మంచి పేరే: అయితే
ఎంతవరకు చదువుకున్నావు?
స : గొంతువరకు.
రామ : అబ్బో ! పెద్ద చదువే.
గం: మాష్టరును పెట్టి హార్మనీ మీద సంగీతం కూడా చెప్పించారు.
రామ : అబ్బో! అదెంతవరకు ?
స : పాటకచ్చేరీ చేసేంతవరకు.
రామ : అద్బో! ఇంకేం స్కూలు పెట్టొచ్చు? పోటోలో పిల్ల ఇంత నల్లగా
లేదే! (దాంతో అప్పటివరకు ఆపుకున్న కోపం ఆగక రోషం ప్రకోపించి, "కాస్త కళ్ళజోడు తీసి చూడండి" అని మూతి విరుచుకొని చరచరా తన గది లోనికి వెళ్ళిపోతుంది.
గం: పాపం ! దాని తప్పేముంది లెండి! రోజుకొకడు రావడం, చూడడం, పోవడం. అసలే దానికి ముక్కుమీద ఉంటుంది కోపం, రోషం జాస్తి. ఆ పిల్ల వుంది చూశారూ లక్ష్మి - కొట్టు, కొయ్యి; నోరెత్తదు. ఎంతో మంచిపిల్ల.
రామ : చాలా ఓపికగల పిల్లలా గుంది. జీతం ఎంత యిస్తారో :
గం : జీతమూ, పాడూ! పనిమనిషి అయితే ఏనాడో పారిపోయేది. అది గుండమ్మ మారుకూతురు.
రామ : ఓహో! ఆ పిల్ల పెండ్లి మాటేం చేశారు ?
గం : దాని పెండ్లి మాటేముంది లెండి! కట్నాలు, కానుకలు, అసలు పెండ్లి ఖర్చులే దండగనుకుంటూంటే : ఎవడో దిక్కులేని వాడికిచ్చి పెండ్లి చేసేస్తా. ఏదో పెట్టింది తిని యింట్లో పనీ-పాటా చేస్తూ వాడే పడుంటాడు. కొంపదీసి ఆ పిల్లను చేసుకుంటా రేమిటి ? మా గుండమ్మ చస్తే వొప్పు కోదు. చూస్తూ చూస్తూ ఇంత మంచి కలిగిన సంబంధానికిచ్చి చేస్తుందా ? దాని కళ్ళల్లో నిప్పులు పోసుకోదూ! (అంటూండగానే గుండమ్మ హాల్లో కొస్తుంది.
గుం: అమ్మాయికి వొంట్లో ఇవాళ ఏం బాగాలేదు. కొంచెం చిరాకుగా ఉంది .)
NOTE: ఎవరు కాపీ రైట్ ఇవ్వ్వకండి ఇది వినోదం అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అందరికి ఫ్రీ గ అందించాలి అని షేర్ చేస్తున్నం మీరు ఎమన్నా మాకు తెలియా చేయాలి లేదా మీ ఆర్టికల్స్ డిలీట్ చేయాలి అంటే మెయిల్ చేయండి -- contact
NOTE : No one give copy right this is only for entertainment and education purpose sharing free to all you should let us know or delete your articles mail-- contact
The content I uploaded is not available in any website so I uploaded it on them if the content I uploaded is yours then contact me everyone
0 Comments